
మాజీ క్రికెటర్ 'అజహర్' షూటింగ్ ప్రారంభం
ముంబై: పేదరికంలో పుట్టాడు.. రోజూ సైకిల్ మీద వెళ్లి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. జాతీయ జట్టులో స్థానం పొందాడు. విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కుని జీవితకాల నిషేధానికి గురయ్యాడు..కోర్టు తీర్పుతో విముక్తుడయ్యాడు.
ఇలా ట్విస్టుల మీద ట్వీస్టులతో డ్రామాకు ఏమాత్రం తగ్గని మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితగాధ 'అజహర్' టైటిల్ తో వెండితెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైనట్లు అజహర్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ ట్విట్ చేశాడు. 'అజహర్ జర్నీని ప్రారంభించాం.. మాకు విజయం చేకూరాలని విష్ చేయండి' అంటూ నెటిజన్లను అభ్యర్థించాడు. మే 13, 2016న విడుదల కానున్న ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఏక్తాకపూర్ నిర్మాత.