పాకిస్తాన్‌కు కశ్మీర్‌ అక్కర్లేదు: అఫ్రిది | Pakistan does not want Kashmir | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు కశ్మీర్‌ అక్కర్లేదు: అఫ్రిది

Published Thu, Nov 15 2018 3:17 AM | Last Updated on Thu, Nov 15 2018 3:17 AM

Pakistan does not want Kashmir - Sakshi

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కశ్మీర్‌ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు కశ్మీర్‌ అక్కర్లేదనీ, ఇప్పుడున్న 4 ప్రావిన్సులనే పాక్‌ సరిగ్గా పాలించుకోలేకపోతోందని అన్నారు. బ్రిటన్‌ పార్లమెంటులో విద్యార్థులతో జరిగిన సమావేశంలో అఫ్రిది ఇలా మాట్లాడారు. ‘పాక్‌కు అసలు కశ్మీర్‌ అక్కర్లేదు. దాన్ని భారత్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ను స్వతంత్రంగా ఉండనిద్దాం. అప్పుడైనా కనీసం మానవత్వం బతికుంటుంది. ఏ మతానికి చెందిన ప్రజలైనా చనిపోవడమన్నది బాధాకరం’ అని అఫ్రిది మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement