Shahid Afridi comments
-
టీమిండియాపై ఇంగ్లండ్‌దే విజయం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్‌లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్‌కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్‌కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్‌లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్‌లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్‌గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు. -
పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదు: అఫ్రిది
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు కశ్మీర్ అక్కర్లేదనీ, ఇప్పుడున్న 4 ప్రావిన్సులనే పాక్ సరిగ్గా పాలించుకోలేకపోతోందని అన్నారు. బ్రిటన్ పార్లమెంటులో విద్యార్థులతో జరిగిన సమావేశంలో అఫ్రిది ఇలా మాట్లాడారు. ‘పాక్‌కు అసలు కశ్మీర్ అక్కర్లేదు. దాన్ని భారత్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ను స్వతంత్రంగా ఉండనిద్దాం. అప్పుడైనా కనీసం మానవత్వం బతికుంటుంది. ఏ మతానికి చెందిన ప్రజలైనా చనిపోవడమన్నది బాధాకరం’ అని అఫ్రిది మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఆఫ్రిదిపై పాక్‌లో రచ్చ... రచ్చ...
కెప్టెన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు కోల్‌కతా: మైదానంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమో కానీ ఆ జట్టు చుట్టూ నిరంతరం వివాదాలు వెన్నంటే ఉంటాయి కాబోలు.. మొన్నటి వరకు భద్రతా కారణాలు చూపి టి20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఆడుతుందా.. లేదా? అనే అనుమానం ఉన్నా ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. తీరా పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టిందో లేదో ఆఫ్రిది రూపంలో మరో రచ్చ మొదలైంది. యథాలాపంగా అన్నాడో.. మరేంటో కానీ తమ జట్టుకు పాక్‌కన్నా భారత్‌లోనే అభిమానం ఎక్కువ అన్న ఈ సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో అతడిని దోషిగా మార్చాయి. ‘ఇతర దేశాలకన్నా భారత్‌లో ఆడడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. భారత్‌లో నాకు ఆదరణ ఎక్కువ. అసలు మా జట్టుకు పాక్లోకన్నా భారత్‌లోనే ఎక్కువ అభిమానం లభిస్తుంది’ అని గత ఆదివారం ఆఫ్రిది అన్నాడు. దీంతో భారత్‌ను బద్ద శత్రువుగా భావించే అక్కడి అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. భారత్‌కు వెళ్లింది ఆ దేశాన్ని పొగడడానికా.. మ్యాచ్‌లు ఆడడానికా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ‘మన దేశ క్రికెట్‌కు భారత్ చేసిన సేవ ఏమిటని పొగుడుతున్నావ్.. నీవు సిగ్గుపడాల్సిన విషయమిది’ అని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ విరుచుకుపడ్డారు. ఇక ఆఫ్రిది తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రజల మనోభావాలను గాయపరిచాడంటూ అతడికి ఓ లాయర్ లీగల్ నోటీసులు కూడా పంపాడు. పాజిటివ్‌గా తీసుకోవాలి: ఆఫ్రిది తన కామెంట్స్‌తో అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టడంతో పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను అంతా పాజిటివ్‌గా తీసుకోవాలని సూచించాడు. ఇక్కడి అభిమానులను గౌరవించే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఇక్కడ కేవలం పాక్ జట్టు కెప్టెన్ మాత్రమే కాను. మొత్తం పాక్ ప్రజల ప్రతినిధిని. నా వ్యాఖ్యలను పాజిటివ్ దృష్టితో చూస్తే సరైనవే అనిపిస్తుంది. విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చాను. ఇక్కడ ఆడే మ్యాచ్‌లను మేం బాగా ఆస్వాదిస్తాం. అదే చెప్పాను. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఇమ్రాన్, వసీం, వఖార్, ఇంజమామ్లను అడిగినా ఇక్కడి ఆదరణ గురించి చెబుతారు. పాక్ అభిమానులను అవమానపరిచే ఉద్దేశం లేదు. నాకు గుర్తింపునిచ్చింది పాకిస్తానే’ అని ఆఫ్రిది స్పష్టం చేశాడు. మరోవైపు అతడి వ్యాఖ్యలకు పాక్ కోచ్ వఖార్ యూనిస్ మద్దతు పలికాడు. అందులో ఎలాంటి తప్పు లేదని తేల్చాడు. దృష్టంతా ఆట మీద నిలపాలని తమ ఆటగాళ్లకు హితవు పలికారు. ప్రాక్టీస్‌కు గైర్హాజరు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు ఆఫ్రిది గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అయితే జ్వరం కారణంగానే తను తప్పుకున్నాడని కోచ్ వఖార్ యూనిస్ తెలిపారు. ‘వివాదం కారణంగా తను గైర్హాజరు కాలేదు. ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నాడు. అందుకే విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని చెప్పాం’ అని వఖార్ అన్నారు. -
'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'
కోల్ కతా: షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీనిపై మాజీ కెప్టెన్ మియాందాద్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డాడు. కాగా, టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తామని వకార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బాగా ఆడుతోందని, ఆ జట్టును ఆషామాషిగా తీసుకోబోమని చెప్పాడు. ఆఫ్రిదికి ఒంట్లో బాలేకపోవడంతో ఈరోజు ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించాడు. రేపటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.