'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు' | I did not find anything controversial in Afridi comments: Waqar Younis | Sakshi
Sakshi News home page

'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'

Published Tue, Mar 15 2016 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'

'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'

కోల్ కతా: షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీనిపై మాజీ కెప్టెన్ మియాందాద్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డాడు.

కాగా, టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తామని వకార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బాగా ఆడుతోందని, ఆ జట్టును ఆషామాషిగా తీసుకోబోమని చెప్పాడు. ఆఫ్రిదికి ఒంట్లో బాలేకపోవడంతో ఈరోజు ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించాడు. రేపటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement