WT20
-
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
12th exams : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా క్రికెటర్ దూరం (ఫొటోలు)
-
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
విండీస్ దూకుడుగా ప్రారంభిస్తే..
వాంఖడే : ప్రపంచకప్2016 టీ20ల్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో టీం ఇండియా స్లోగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి చివర్లో దూకుడుగా ఆడుతోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి స్లోగా మ్యాచ్‌ను ఫినిష్ చేస్తోంది. ఈ రెండు జట్లు కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. భారత ఓపెనర్ల వైఫల్యంతో ప్రపంచకప్ టీ20లో జరిగిన మ్యాచ్‌లలో తొలుత రన్‌రేట్ పడిపోయినా చివర్లో కోహ్లీ మెరుపులతో విజయాన్ని దక్కించుకుంది. మరో వైపు వెస్టిండిస్ ఇందుకు భిన్నంగా మొదట్లో రన్ రేట్ భాగానే ఉన్నా ఇన్నింగ్స్ చివరికి వచ్చే సరికి అనుకున్న స్థాయిలో కాకుండా నిధానంగా గెలుపుతో ముగించేస్తోంది. అఫ్ఘాన్‌తో వెస్టిండిస్ ఓడిపోయిన మ్యాచ్‌లోనూ మొదట్లో రన్‌రేట్ భాగానే ఉన్నా చివర్లో మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. దీని మూలంగానే మ్యాచ్‌ను ఆఫ్ఘన్‌కు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఒక సారి ఇరు జట్ల రన్రేట్లను దశల వారిగా పరిశీలిద్దాం. ఇండియా ఓవర్లు వెస్టిండిస్ 5.66 పవర్ ప్లే (1 నుంచి 6 ఓవర్లు) 6.87 6.80 మిడిల్ ఓవర్స్(7 నుంచి 15 ఓవర్లు) 7.08 9.41 చివరి ఐదు ఓవర్లు(16 నుంచి 20 ఓవర్లు) 8.04 6.90 మొత్తంగా 7.22 -
బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్
-
టీమిండియా అదరహో..
-
దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ అద్భుత విజయం
-
శ్రీలంక గెలుపుతో ఆరంభించింది
-
ఆఫ్రిదిపై పాక్‌లో రచ్చ... రచ్చ...
కెప్టెన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు కోల్‌కతా: మైదానంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమో కానీ ఆ జట్టు చుట్టూ నిరంతరం వివాదాలు వెన్నంటే ఉంటాయి కాబోలు.. మొన్నటి వరకు భద్రతా కారణాలు చూపి టి20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఆడుతుందా.. లేదా? అనే అనుమానం ఉన్నా ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. తీరా పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టిందో లేదో ఆఫ్రిది రూపంలో మరో రచ్చ మొదలైంది. యథాలాపంగా అన్నాడో.. మరేంటో కానీ తమ జట్టుకు పాక్‌కన్నా భారత్‌లోనే అభిమానం ఎక్కువ అన్న ఈ సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో అతడిని దోషిగా మార్చాయి. ‘ఇతర దేశాలకన్నా భారత్‌లో ఆడడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. భారత్‌లో నాకు ఆదరణ ఎక్కువ. అసలు మా జట్టుకు పాక్లోకన్నా భారత్‌లోనే ఎక్కువ అభిమానం లభిస్తుంది’ అని గత ఆదివారం ఆఫ్రిది అన్నాడు. దీంతో భారత్‌ను బద్ద శత్రువుగా భావించే అక్కడి అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. భారత్‌కు వెళ్లింది ఆ దేశాన్ని పొగడడానికా.. మ్యాచ్‌లు ఆడడానికా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ‘మన దేశ క్రికెట్‌కు భారత్ చేసిన సేవ ఏమిటని పొగుడుతున్నావ్.. నీవు సిగ్గుపడాల్సిన విషయమిది’ అని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ విరుచుకుపడ్డారు. ఇక ఆఫ్రిది తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రజల మనోభావాలను గాయపరిచాడంటూ అతడికి ఓ లాయర్ లీగల్ నోటీసులు కూడా పంపాడు. పాజిటివ్‌గా తీసుకోవాలి: ఆఫ్రిది తన కామెంట్స్‌తో అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టడంతో పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను అంతా పాజిటివ్‌గా తీసుకోవాలని సూచించాడు. ఇక్కడి అభిమానులను గౌరవించే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఇక్కడ కేవలం పాక్ జట్టు కెప్టెన్ మాత్రమే కాను. మొత్తం పాక్ ప్రజల ప్రతినిధిని. నా వ్యాఖ్యలను పాజిటివ్ దృష్టితో చూస్తే సరైనవే అనిపిస్తుంది. విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చాను. ఇక్కడ ఆడే మ్యాచ్‌లను మేం బాగా ఆస్వాదిస్తాం. అదే చెప్పాను. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఇమ్రాన్, వసీం, వఖార్, ఇంజమామ్లను అడిగినా ఇక్కడి ఆదరణ గురించి చెబుతారు. పాక్ అభిమానులను అవమానపరిచే ఉద్దేశం లేదు. నాకు గుర్తింపునిచ్చింది పాకిస్తానే’ అని ఆఫ్రిది స్పష్టం చేశాడు. మరోవైపు అతడి వ్యాఖ్యలకు పాక్ కోచ్ వఖార్ యూనిస్ మద్దతు పలికాడు. అందులో ఎలాంటి తప్పు లేదని తేల్చాడు. దృష్టంతా ఆట మీద నిలపాలని తమ ఆటగాళ్లకు హితవు పలికారు. ప్రాక్టీస్‌కు గైర్హాజరు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు ఆఫ్రిది గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అయితే జ్వరం కారణంగానే తను తప్పుకున్నాడని కోచ్ వఖార్ యూనిస్ తెలిపారు. ‘వివాదం కారణంగా తను గైర్హాజరు కాలేదు. ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నాడు. అందుకే విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని చెప్పాం’ అని వఖార్ అన్నారు. -
'ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం లేదు'
కోల్ కతా: షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల్లో వివాదం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. దీనిపై మాజీ కెప్టెన్ మియాందాద్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డాడు. కాగా, టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడిస్తామని వకార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బాగా ఆడుతోందని, ఆ జట్టును ఆషామాషిగా తీసుకోబోమని చెప్పాడు. ఆఫ్రిదికి ఒంట్లో బాలేకపోవడంతో ఈరోజు ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించాడు. రేపటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. -
వరల్డ్ కప్‌కు మేం సిద్ధం: విరాట్ కోహ్లీ
'టీ20 వరల్డ్ కప్'లో భారత విజయానికి జట్టులోని సభ్యులందరూ తమ వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ జట్లు ఈ సిరీస్‌లో ఆడుతుండటంతో మ్యాచ్‌లు పోటా పోటీగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో చేసిన తప్పిదాలను ఈ సిరీస్ లో పునరావృతం చేయకుండా గ్రౌండ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచేలా మేము సన్నద్ధం అవుతున్నామన్నారు. గత 11 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచి ధీమాగా ఉన్నామన్నారు. సొంతగడ్డపై ఒత్తిడి అధిగమించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆసియా కప్ మమ్మల్ని'టీ20 వరల్డ్ కప్' కు సన్నద్దం చేసిందన్నారు. వార్మప్ మ్యాచ్‌లో షమీ బాగా బౌలింగ్ చేశాడు. జట్టులో అతను తిరిగి రావడం కలిసొచ్చే అవకాశం అన్నారు. -
భువీ, ఇషాంత్ లకు షాక్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన టీమిండియా జట్టును భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో టీమిండియా జట్టును ఎంపిక చేశారు. దాదాపు ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో ఆడిన జట్టునే ఎంపిక చేయగా, శ్రీలంకతో టీ 20 సిరీస్ కు ఎంపికైన యువ ఆల్ రౌండర్ పవన్ నేగీకి జట్టులో స్థానం కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే, సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు సెలక్టర్లు షాకిచ్చారు. మరోవైపు జాతీయ జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూసిన వెటరన్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కు మరోసారి చుక్కెదురైంది. ఇటీవల ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన ఇర్ఫాన్ తన స్థానంపై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ఈ భేటీకి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, వన్డే కెప్టెన్ ధోనీ, పలువురు బోర్డు సభ్యులు హాజరై సుదీర్ఘంగా చర్చించిన పిదప జట్టులోని సభ్యులను ప్రకటించారు. ఆసియా కప్, వరల్డ్ టీ 20 లకు టీమిండియా జట్టు; కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, హర్బజన్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, పవన్ నేగి, షమీ అహ్మద్ -
ఆసీస్ జట్టు కన్సల్టెంట్‌గా శ్రీరామ్
మెల్బోర్న్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్, మైక్‌హస్సీలను ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్స్గా నియమించుకుంది. టోర్నీ ఆరంభ దశలో శ్రీరామ్.. ఆసీస్ జట్టు సన్నాహాకాలను పర్యవేక్షిస్తాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తోనే శ్రీరామ్ బాధ్యతలు చేపడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ‘భారత్‌కు వచ్చే ముందు మేం ప్రొటీస్‌తో సిరీస్ ఆడతాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీరామ్ దృష్టిపెడతాడు. అలాగే భారత్‌లో ఎదురయ్యే పరిస్థితులపై క్రికెటర్లకు శిక్షణ ఇస్తాడు. హస్సీకి టి20లతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా అనుభవం ఉంది. కాబట్టి అతని సేవలను కూడా వినియోగించుకుంటాం’ అని సీఏ పేర్కొంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు సహాయక కోచ్‌గా వ్యవహరించిన శ్రీరామ్... భారత్ తరఫున 2000-04 మధ్య ఎనిమిది వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.