వరల్డ్ కప్కు మేం సిద్ధం: విరాట్ కోహ్లీ | Pretty confident with the way we have been playing | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్కు మేం సిద్ధం: విరాట్ కోహ్లీ

Published Mon, Mar 14 2016 3:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

వరల్డ్ కప్కు మేం సిద్ధం: విరాట్ కోహ్లీ

వరల్డ్ కప్కు మేం సిద్ధం: విరాట్ కోహ్లీ

'టీ20 వరల్డ్ కప్'లో భారత విజయానికి జట్టులోని సభ్యులందరూ తమ వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తెలిపారు.  ప్రపంచంలోనే ఉత్తమ జట్లు ఈ సిరీస్లో ఆడుతుండటంతో మ్యాచ్లు పోటా పోటీగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో చేసిన తప్పిదాలను ఈ సిరీస్ లో పునరావృతం చేయకుండా గ్రౌండ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచేలా మేము సన్నద్ధం అవుతున్నామన్నారు.

గత 11 మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచి ధీమాగా ఉన్నామన్నారు. సొంతగడ్డపై ఒత్తిడి అధిగమించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  ఆసియా కప్ మమ్మల్ని'టీ20 వరల్డ్ కప్' కు సన్నద్దం చేసిందన్నారు.  వార్మప్ మ్యాచ్లో  షమీ బాగా బౌలింగ్ చేశాడు. జట్టులో అతను తిరిగి రావడం కలిసొచ్చే అవకాశం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement