విండీస్ దూకుడుగా ప్రారంభిస్తే..
వాంఖడే :
ప్రపంచకప్2016 టీ20ల్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో టీం ఇండియా స్లోగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి చివర్లో దూకుడుగా ఆడుతోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి స్లోగా మ్యాచ్‌ను ఫినిష్ చేస్తోంది. ఈ రెండు జట్లు కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. భారత ఓపెనర్ల వైఫల్యంతో ప్రపంచకప్ టీ20లో జరిగిన మ్యాచ్‌లలో తొలుత రన్‌రేట్ పడిపోయినా చివర్లో కోహ్లీ మెరుపులతో విజయాన్ని దక్కించుకుంది.
మరో వైపు వెస్టిండిస్ ఇందుకు భిన్నంగా మొదట్లో రన్ రేట్ భాగానే ఉన్నా ఇన్నింగ్స్ చివరికి వచ్చే సరికి అనుకున్న స్థాయిలో కాకుండా నిధానంగా గెలుపుతో ముగించేస్తోంది. అఫ్ఘాన్‌తో వెస్టిండిస్ ఓడిపోయిన మ్యాచ్‌లోనూ మొదట్లో రన్‌రేట్ భాగానే ఉన్నా చివర్లో మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. దీని మూలంగానే మ్యాచ్‌ను ఆఫ్ఘన్‌కు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఒక సారి ఇరు జట్ల రన్‌రేట్లను దశల వారిగా పరిశీలిద్దాం.
ఇండియా ఓవర్లు వెస్టిండిస్
5.66 పవర్ ప్లే (1 నుంచి 6 ఓవర్లు) 6.87
6.80 మిడిల్ ఓవర్స్(7 నుంచి 15 ఓవర్లు) 7.08
9.41 చివరి ఐదు ఓవర్లు(16 నుంచి 20 ఓవర్లు) 8.04
6.90 మొత్తంగా 7.22