పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్‌లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్‌కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు.
భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్‌కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్‌తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్‌లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు.
అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్‌లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్‌గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment