ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా పాంటింగ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మ్యాచ్ కామెంటరీ చేస్తున్న పాంటింగ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన పాంటింగ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పాంటింగ్ కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికైతే పాంటింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఆస్ట్రేలియా క్రికెట్‌లో రికీ పాంటింగ్‌ది ప్రత్యేక ప్రస్థానం. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా పాంటింగ్ ఘనత అందుకున్నాడు. 1995 నుంచి 2012 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన పాంటింగ్ ఆల్‌టైం గ్రేట్ బ్యాట్స్‌మన్ లిస్టులో చోటు సంపాదించాడు. పాంటింగ్ ఆసీస్ తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు, 375 వన్డేల్లో 13,704 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 41 టెస్టు సెంచరీలు, 30 వన్డే సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment