
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్న తమన్నా.. తాజాగా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్ నిజమేనని ఒప్పుకుంది. వారిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో ప్రేమ కథ ప్రారంభమైందని ఆమె వెల్లడించింది. తమన్నా, విజయ్ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి.
(ఇదీ చదవండి: ధనుష్‌కు షాక్ ఇచ్చిన కంగనా రనౌత్?)
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు. ' సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు.
నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం' అని చెప్పింది. దీంతో అన్నీ అనుకూలిస్తే త్వరలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్)
Comments
Please login to add a commentAdd a comment