Why Kriti Sanon Get Chance In Prabhas Adipurush, Reveals Secret - Sakshi
Sakshi News home page

ఈ కారణం వల్లే ప్రభాస్‌తో ఛాన్స్‌ దక్కింది: కృతి సనన్‌

Published Sun, Jun 11 2023 5:04 PM | Last Updated on Sun, Jun 11 2023 5:33 PM

Kriti Sanon Get Chance Prabhas Adipurush Reveal Secret - Sakshi

టాలీవుడ్‌లో ప్రిన్స్‌ మహేష్‌ బాబు '1: నేనొక్కడినే' సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్‌లో దూసుకుపోతోంది కృతి సనన్‌. రామాయణం నేపథ్యంలో వస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌’లో సీతగా రానుంది. రాముడిగా ప్రభాస్‌ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్‌.  జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా సీతగా తననే ఎందుకు ఎంపిక చేశారో కృతి సనన్‌ తెలిపింది.  

(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్‌ చేసుకున్న హీరోయిన్‌)

''ఆదిపురుష్‌’లో ఛాన్స్ రావడం నా అదృం.. నా హైట్ ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి. కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్ల‌స్ అయింది. ప్రభాస్‌ మంచి ఎత్తు ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్‌ అవుతానని మేకర్స్‌ సంప్రదించారు. సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'. అని తెలిపింది. మొత్తానికి హైట్ కార‌ణంగానే సీత పాత్ర కోసం త‌న‌ను ఎంచుకున్నార‌ని కృతి స‌న‌న్ వెల్ల‌డించింది. దీంతో నెట్టింట్ట ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే కృతి స‌నన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని కామెంట్స్‌ చేశారు. 

(ఇదీ చదవండి: 'తమన్‌పై ట్రోల్స్‌.. భార్యగా బాధగానే ఉంటుంది')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement