హీరోయిన్ తెల్లబుగ్గలే ఎందుకు అందంగా కనిపిస్తాయ్! | Randeep Hooda and Ileana new film Unfair and Lovely, shoot begins in Nov  | Sakshi
Sakshi News home page

హీరోయిన్ తెల్లబుగ్గలే ఎందుకు అందంగా కనిపిస్తాయ్!

Published Thu, Oct 15 2020 3:05 PM | Last Updated on Thu, Oct 15 2020 3:29 PM

Randeep Hooda and Ileana new film Unfair and Lovely, shoot begins in Nov  - Sakshi

సాక్షి,ముంబై: కరోనా సంక్షోభం, లాక్ డౌన్ అనంతరం సినీ పరిశ్రమ క్రమంగా షూటింగ్ కార్యక్రమాలలో బిజీ అవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ విలక్షణ హీరో రణదీప్‌ హుడా, అందాల హీరోయిన్ ఇలియానా తొలిసారిగా జంటగా నటిస్తున్న 'అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' సినిమా త్వరలోనే పట్టాలెక్కేందుకు రడీ అవుతోంది. బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. సందర్భంగా హీరో హీరోయిన్లు, ఇలియానా, రణదీప్ సోషల్ మీడియాలో లవ్లీ సంకేతాలందించారు. 

అందంగా ఉన్నవారంతా తెల్లగా ఉండరు.. తెల్లగా ఉన్నవారంతా అందంగా ఉండరు. అర్థంకాలేదా.. తన రాబోయే చిత్రంలో అర్థం అవుతుందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు  చిత్ర హీరో రణదీప్. హీరోయిన్ తెల్లబుగ్గలే హీరోకు ఎందుకు అందంగా కనిపిస్తాయో ఎపుడైనా ఆలోచించారా? వెల్..అదంతా పాతమాట..ఇపుడు 'అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' అంటూ ఇల్లీ బేబి కమెంట్ చేశారు. చిత్రం బృందంతో రీయూనిట్ కావడం సంతోషంగా ఉందంటూ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు.

వీరితోపాటు దర్శకుడు బల్విందర్ సింగ్ జంజువా కూడా సోషల్ మీడియాలో తమ మూవీ అప్ డేట్ ఇచ్చారు. ప్రేమించే వ్యక్తి కోసం ఎదురుచూస్తోంటే.. ప్రేమను మాత్రమే చూడండి.. ఫెయిర్‌నెస్ కోసం చూడటం పిచ్చితనమవుతుందని పోస్ట్ పెట్టారు. 2021లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ హర్యానా నేపథ్యంలో తెరకెక్కనుందట. ప్రధానంగా సమాజంలో పాతుకుపోయిన  వర్ణ వివక్షపై  పోరాడే యువతిగా విభిన్నమైన పాత్రలో ఇలియానా కనిపించబోతున్నారు.  అలాగే ఈ మూవీతో బిల్వేందర్‌ సింగ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. శకుంతలా దేవీ బయోపిక్ తరువాత సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement