ఓపెనింగ్‌ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్‌ | Ajay Devgan Raid Registers Second Biggest Weekend Opening Film In 2018 | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రెయిడ్‌

Published Mon, Mar 19 2018 4:25 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Ajay Devgan Raid Registers Second Biggest Weekend Opening Film In 2018 - Sakshi

రైడ్‌ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, ఇలియానా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ తాజా సినిమా ‘రెయిడ్‌’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్‌ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్‌ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది.

బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్‌’... ఈ ఏడాది వీకెండ్‌ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచిందని ఫిలీం ట్రెడ్‌ అనలిస్ట్‌ తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్‌ కలెక్షన్లతో పద్మావత్‌ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్‌ రెండో స్థానంలో ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన  ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement