భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్‌ | Ajay Devgns Raid Film Second Day Collection | Sakshi
Sakshi News home page

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్‌

Published Sun, Mar 18 2018 6:15 PM | Last Updated on Mon, Mar 19 2018 6:40 PM

 Ajay Devgns Raid Film Second Day Collection - Sakshi

రైడ్‌ సినిమాలో అజయ్‌ దేవ్‌గన్‌, ఇలియానా

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ తాజా సినిమా ‘రెయిడ్‌’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది.  మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్‌ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్‌ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్‌ అనాలిస్ట్‌ తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గన్‌ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ క‌మీష‌న‌ర్‌ అమై ప‌ట్నాయ‌క్ పాత్రలో అజ‌య్ దేవ‌గ‌ణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement