తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి!
‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారు ఇలియానా. ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది. కానీ, సినిమా తారలకు వంట్లో ఓపిక, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నంత కాలం సినిమాలు చేయొచ్చు. ఒకవేళ క్రేజ్ తగ్గి, బలవంతంగా రిటైర్ కావాల్సి వస్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారుముందుంచితే - ‘‘సినిమాల్లోకి వచ్చేటప్పుడు మా అమ్మ ‘వృత్తిపై ఎక్కువగా మమకారం పెంచుకోవద్దు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం శ్రేయస్కరం’ అని చెప్పింది.
ఆ మాటలు బాగా జీర్ణించుకున్నాను. ప్రతి సినిమాని ప్రేమించి చేస్తాను. కానీ, ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తే, హ్యాపీగా గుడ్‌బై చెప్పేస్తా. ఎందుకంటే, ‘మేం చూడలేకపోతున్నాం బాబూ’ అని ప్రేక్షకులు నెత్తీ నోరూ బాదుకునే లోపే సర్దుకుంటే మంచిది కదా. ఇక్కడ ఇంకో విషయం కూడ చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఓ టైముంటుంది. ఆ టైమ్‌లో ఎవరు వద్దన్నా, కాదన్నా వెలుగులు విరజిమ్ముతారు. ఆ టైమ్ అయిన తర్వాత ఆ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఈ మార్పుని ఆహ్వానించగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం’’ అని చెప్పారు.