అది బాలీవుడ్! | That is bollywood! | Sakshi
Sakshi News home page

అది బాలీవుడ్!

Published Sun, Mar 30 2014 4:01 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇలియానా - Sakshi

ఇలియానా

హీరోయిన్స్కు టాలీవుడ్లో సాగినట్లు బాలీవుడ్లో సాగుతుందా? అంటే సాగదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ పరిస్థితులు వేరు. ఆ మార్కెట్ వేరు. ఈ మార్కెట్ వేరు. అలాగే అక్కడ మనుషులకు ఇక్కడ మనుషులకు కూడా తేడా ఉంటుంది. పరిస్థితులను బట్టే మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడ బాగా సాగించుకున్న ఓ నాజూకు నడుం అమ్మడు బాలీవుడ్లో మాత్రం వారు చెప్పినట్లు వింటోంది.

ఇలియానా దక్షిణ భారత సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ నటించిన సినిమా ద్వారానే ఈ బ్యూటీకి బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. అంతే అక్కడకు చెక్కేసింది. ఇటువైపు చూడటమే మానివేసింది. ఇక్కడ కుదిరినట్లు అక్కడ కుదరదుకదా! అక్కడ కష్టాలు మొదలయ్యాయి. ఈ ముద్దుగుమ్మ ఇక్కడ చాలా ఫోజులు కొట్టింది. బాలీవుడ్లో మాత్రం మాట్లాడకుండా పని చేసుకుపోతోంది.

ఇలియానా దక్షిణాది సినిమా రంగాన్ని పూర్తిగా వదిలివేసింది. ఇప్పుడు బాలీవుడ్పైనే దృష్టంతాపెట్టింది. ఇక్కడ నటించినప్పుడు సినిమా ప్రమోషన్ రావాలంటే సినిమా టీమ్ని ముప్పతిప్పలు పెట్టేది. నోరుపారేసుకుంటుందని చెబుతుంటారు. ఈ విషయాలలో ఈవిడగానికి ఇక్కడ పెద్దపేరే ఉంది. అంతేకాకుండా ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిందంటే ఇక అంతే. ఆ మూవీని పట్టించుకునేదిద కాదట ఈ ఇల్లీబేబి. ఆమె చేష్టలు, ప్రవర్తనతో విసిగిపోయిన మన నిర్మాతలు, హీరోలు సినిమా ఆఫర్లు ఇవ్వడం మానివేసినట్లు సమాచారం.

బాలీవుడ్లో మాత్రం ఇలియానా ఆటలు సాగటంలేదు. ప్రస్తుతం మై తేరా హీరో అనే సినిమా ప్రమోషన్ కోసం ఈ రివట సుందరి దేశమంతా తిరుగుతోంది. హీరో వరుణ్ థావన్తో కలిసి ఇంటర్వూలు కూడా ఇస్తోంది.  ఈ బొమ్మ ఏ వేషాలు వేసినా ఇక్కడైతే నడిచింది కానీ, బాలీవుడ్లో ప్రమోషన్స్కు డుమ్మా కొడితే అవకాశాలే గల్లంతవుతాయి. ఆ విషయం అమ్మడుకి తెలుసు. అందుకే ఈ ఇల్లీబేబీకి తిప్పలు తప్పటంలేదు. వదిలేయటానికి అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్! వాళ్లు చెప్పినట్లు వినక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement