బాలీవుడ్ నటి నందా కన్నుమూత | Bollywood actress Nanda passes away | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటి నందా కన్నుమూత

Published Tue, Mar 25 2014 7:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ నటి నందా - Sakshi

బాలీవుడ్ నటి నందా

ముంబై: అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి నందా(75) కన్నుమూశారు. అంధేరీలోని తన నివాసంలో ఈరోజు ఉదయం గుండెపోటులో ఆమె మృతి చెందారు. ఆరోగ్యంగా ఉన్న నందా ఆకస్మికంగా మృతి చెందినట్లు ఆమె బంధువులు చెప్పారు. నందా చక్కటి అందంతోపాటు అద్భుతమైన నటననను ప్రదర్శించారు. 1960-70 దశకంలో వెండితెరను ఏలారు. హమ్ దోనో, గుమ్నామ్, జబ్ జబ్ పూల్ ఖిలే... వంటి చిత్రాలలో మరపురాని పాత్రలు పోషించారు.

దేవానంద్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా వంటి అగ్ర హీరోలతో నటించారు. ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్కు నందా మేనకోడలు. ఆమె తండ్రి వినాయక్ దామోదర్ మరాఠీ దర్శకుడు. 1939లో మహారాష్ట్రలో జన్మించిన నందా బాల్యంలోనే నటించడం మొదలుపెట్టారు. ఆమె బాల్యంలో ఉండగానే తండ్రి మరణించారు. దాంతో కుటుంబానికి అండగా నిలవవలసి వచ్చింది. నందా నడివయసులో నిర్మాత మన్మోహన్ దేశాయ్కు దగ్గరయ్యారు. 1994లో దేశాయ్ చనిపోయేంతవరకు ఆయనతోనే కలసి ఉన్నారు. నందా మృతికి బాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement