వంద కోట్లకుపైగా వసూలు చేసిన 25 సినిమాలు
బాలీవుడ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తీగా మారిపోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు ఎన్ని రోజులు అడిందని చూడటంలేదు. వందరోజులు, సిల్వర్ జూబ్లీ, సూపర్ హిట్, బంపర్ హిట్లు ఇప్పుడు లెక్కలేదు. ఎన్ని కో్ట్ల రూపాయలు వసూలు చేసిందనేదే ముఖ్యం. తక్కువ రోజులు ఆడినా కలెక్షన్లు రాబడితేనే హిట్గా భావిస్తారు. వంద కోట్లు దాటితేనే బంపర్ హిట్ కింద లెక్క. వంద కోట్లు, అంతకు మించి వసూలు చేస్తే గొప్ప. ఇప్పటి వరకూ బాలీవుడ్, కోలీవుడ్ కలుపుకొని 25 చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాయి.
సినిమా నిర్మాణం కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న లక్ష్యంతో జరుగుతోంది. పెద్ద హీరోల లక్ష్యం వంద కోట్లు. పైరసీల దెబ్బకు ఇంత కలెక్షన్లు సాధించడం కష్టమే. అయితే పెద్ద హీరోల చిత్రాలను కలెక్షన్ల కోసం నిర్మాతలు ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వాటిలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్మాతలకు కనకవర్గం కురుస్తోంది. ఒకటి, రెండు వారాల్లోనే కలెక్షన్లు దండుకోవడానికి నిర్మాతలు అలవాటుపడిపోయారు. పైరసీల తాకిడి తట్టుకోవడానికి వారికి మరో మార్గంలేదు.
వంద కోట్ల రూపాయలు, అంతకు మించి వసూలు చేసిన సినిమాలు:
సల్మాన్ ఖాన్ - దబాంగ్ - 150 కోట్లు
సల్మాన్ ఖాన్ - రెడీ - 130 కోట్లు
సల్మాన్ ఖాన్ - బాడీగార్డ్ -155 కోట్లు
సల్మాన్ ఖాన్ - ఏక థా టైగర్ - 198 కోట్లు
సల్మాన్ ఖాన్ - దబాంగ్ 2 - 178 కోట్లు
షారూక్ ఖాన్ - రా-వన్ - 117 కోట్లు
షారూక్ ఖాన్ - డాన్ 2 - 114 కోట్లు
షారూక్ ఖాన్ - జబ్ తాక్ హైజాన్ - వంద కోట్లు
షారూక్ ఖాన్ - చెన్నై ఎక్స్ప్రెస్ - 214 కోట్టు
అజయ్ దేవగన్ - గోల్మాల్ 3 - 108 కోట్లు
అజయ్ దేవగన్ - సింగం - వంద కోట్లు
అజయ్ దేవగన్ - బోల్బచ్చన్ - 104 కోట్లు
అజయ్ దేవగన్ - సన్ ఆఫ్ సర్దార్ 106 కోట్లు
అమీర్ ఖాన్ - గజనీ - 115 కోట్లు
అమీర్ ఖాన్ - 3 ఇడియట్స్ - 202 కోట్లు
అక్షయ్ కుమార్ - హౌస్ఫుల్ - 112 కోట్లు
అక్షయ్ కుమార్ - రౌడీ రాథోర్ - 133 కోట్లు
రణబీర్ కపూర్ - బర్ఫీ - 122
రణబీర్ కపూర్ - యే జవాని హై దివాని -189 కోట్లు
హృతిక్ రోషన్ - అగ్నిపథ్ - 122
ఫర్హాన్ అక్తర్ - బాగ్ మిల్కా బాగ్ - 104 కోట్లు
సైఫ్ ఆలీ ఖాన్ - రేస్ 2 - 115 కోట్లు
దక్షిణాదిలో కూడా ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి. 'ఎంథిరన్' (తెలుగులో శివాజీ), దశావతారం, రోబో చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. ఇక దక్షిణాదిలో వంద కోట్ల క్లబ్లో చేరగల మార్కెట్ ఒక్క తెలుగుకు మాత్రమే ఉంది. అదీ కూడా భవిష్యత్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులకు ఆ ఆవకాశం ఉందని భావిస్తున్నారు.