Rs.100 crore
-
‘రూ.100 కోట్లు అవసరం’
అనంతపురం అర్బన్ : జిల్లాలో నగదు లావాదేవీల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూ.100 కోట్లు అవసరం ఉందని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయించామని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. చిన్న నోట్ల డినామినేషన్ పొందుపరుస్తూ లేఖని ఆర్బీఐకి పంపించాలని ఎల్డీఎం జయశంకర్ని ఆదేశించారు. బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అన్ని బ్యాంక్‌ల చీఫ్ మేనేజర్లతో నగదు లావాదేవీలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ లేదా వీఆర్ఏలతో బృందం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. బృందాలు ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బ్యాంక్ ఖాతా లేని జాబితాను తయారు చేస్తారన్నారు. ఖాతాలు లేనివారికి అకౌంట్లు చేయించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. దాదాపు రెండు లక్షల మంది ఉపాధి కూలీలకు బ్యాంక్ ఖాతాలు తెరవాల్సి ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీకి ఫోన్ ద్వారా ఆదేశించారు. పింఛనుదారులకు సంబంధించి 1.50 లక్షలు ఖాతాలు ఇనాక్టివేషన్‌లో ఉన్నాయని, వీటిని యాక్టివేట్ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొబైల్ బ్యాకింగ్ని అన్ని బ్యాంకులు నిర్వహించాలని చెప్పారు. -
మూడు రోజుల్లో రూ. 121 కోట్లు వసూలు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దిల్వాలే' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. వసూళ్ల వేటలో మరో బాలీవుడ్ సినిమా 'బాజీరావు మస్తానీ' కంటే ముందంజలో నిలిచింది. గత శుక్రవారం విడుదలైన రోమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం దిల్వాలే మూడు రోజుల్లో 121 కోట్ల రూపాయలను వసూలు చేసింది. భారత్‌లో రూ. 65.02 కోట్లు, విదేశాల్లో రూ. 56 కోట్లు రాబట్టింది. విదేశాల్లో ఈ సినిమాకు అమితాదరణ లభిస్తోందని విశ్లేషకుడు కోమల్ నెహతా చెప్పారు. గల్ఫ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం ఇదేనని తెలిపారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించారు. అదే రోజు విడుదలైన హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీకి మూడు రోజుల్లో రూ. 46.77 కోట్లు (భారత్‌లో) కలెక్షన్లు వచ్చాయి. కాగా ఈ సినిమాకు విదేశాల్లో ఏమేరకు కలెక్షన్ల వచ్చాయన్న విషయం తెలియరాలేదు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ నటించారు. ఈ రెండు చిత్రాలను వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ రానుండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వంద కోట్ల నీటి మాఫియా
-
వందకోట్లు కాదు.. ఆనందమే ప్రధానం
ముంబయి: తన చిత్రం ఎన్ని వసూళ్లు రాబట్టిందనేది ముఖ్యం కాదని, ప్రేక్షకులను ఆ చిత్రం మెప్పించిందా లేదా? వారు ఆనందంగా రెండున్నర గంటలు గడిపారా లేదా అన్నదే ప్రధానమని తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రం విడుదలై బాలీవుడ్ లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన 'నా చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అదే నేను కోరుకున్నాను. ఇప్పుడు ఈ చిత్ర బృందమంతా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. నాకు ఆనందమే బారో మీటర్. మా చిత్రం వందకోట్లు దాటింది. కాకపోతే అది ప్రధాన అంశం కాదు' అని ఆయన అన్నారు. -
వంద కోట్లకుపైగా వసూలు చేసిన 25 సినిమాలు
బాలీవుడ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తీగా మారిపోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు ఎన్ని రోజులు అడిందని చూడటంలేదు. వందరోజులు, సిల్వర్ జూబ్లీ, సూపర్ హిట్, బంపర్ హిట్లు ఇప్పుడు లెక్కలేదు. ఎన్ని కో్ట్ల రూపాయలు వసూలు చేసిందనేదే ముఖ్యం. తక్కువ రోజులు ఆడినా కలెక్షన్లు రాబడితేనే హిట్‌గా భావిస్తారు. వంద కోట్లు దాటితేనే బంపర్ హిట్ కింద లెక్క. వంద కోట్లు, అంతకు మించి వసూలు చేస్తే గొప్ప. ఇప్పటి వరకూ బాలీవుడ్, కోలీవుడ్ కలుపుకొని 25 చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాయి. సినిమా నిర్మాణం కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న లక్ష్యంతో జరుగుతోంది. పెద్ద హీరోల లక్ష్యం వంద కోట్లు. పైరసీల దెబ్బకు ఇంత కలెక్షన్లు సాధించడం కష్టమే. అయితే పెద్ద హీరోల చిత్రాలను కలెక్షన్ల కోసం నిర్మాతలు ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వాటిలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్మాతలకు కనకవర్గం కురుస్తోంది. ఒకటి, రెండు వారాల్లోనే కలెక్షన్లు దండుకోవడానికి నిర్మాతలు అలవాటుపడిపోయారు. పైరసీల తాకిడి తట్టుకోవడానికి వారికి మరో మార్గంలేదు. వంద కోట్ల రూపాయలు, అంతకు మించి వసూలు చేసిన సినిమాలు: సల్మాన్ ఖాన్ - దబాంగ్ - 150 కోట్లు సల్మాన్ ఖాన్ - రెడీ - 130 కోట్లు సల్మాన్ ఖాన్ - బాడీగార్డ్ -155 కోట్లు సల్మాన్ ఖాన్ - ఏక థా టైగర్ - 198 కోట్లు సల్మాన్ ఖాన్ - దబాంగ్ 2 - 178 కోట్లు షారూక్ ఖాన్ - రా-వన్ - 117 కోట్లు షారూక్ ఖాన్ - డాన్ 2 - 114 కోట్లు షారూక్ ఖాన్ - జబ్ తాక్ హైజాన్ - వంద కోట్లు షారూక్ ఖాన్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ - 214 కోట్టు అజయ్ దేవగన్ - గోల్మాల్ 3 - 108 కోట్లు అజయ్ దేవగన్ - సింగం - వంద కోట్లు అజయ్ దేవగన్ - బోల్‌బచ్చన్ - 104 కోట్లు అజయ్ దేవగన్ - సన్ ఆఫ్ సర్దార్ 106 కోట్లు అమీర్ ఖాన్ - గజనీ - 115 కోట్లు అమీర్ ఖాన్ - 3 ఇడియట్స్ - 202 కోట్లు అక్షయ్ కుమార్ - హౌస్‌ఫుల్ - 112 కోట్లు అక్షయ్ కుమార్ - రౌడీ రాథోర్ - 133 కోట్లు రణబీర్ కపూర్ - బర్ఫీ - 122 రణబీర్ కపూర్ - యే జవాని హై దివాని -189 కోట్లు హృతిక్ రోషన్ - అగ్నిపథ్ - 122 ఫర్హాన్ అక్తర్ - బాగ్ మిల్కా బాగ్ - 104 కోట్లు సైఫ్ ఆలీ ఖాన్ - రేస్ 2 - 115 కోట్లు దక్షిణాదిలో కూడా ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి. 'ఎంథిరన్' (తెలుగులో శివాజీ), దశావతారం, రోబో చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. ఇక దక్షిణాదిలో వంద కోట్ల క్లబ్లో చేరగల మార్కెట్ ఒక్క తెలుగుకు మాత్రమే ఉంది. అదీ కూడా భవిష్యత్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులకు ఆ ఆవకాశం ఉందని భావిస్తున్నారు.