
వందకోట్లు కాదు.. ఆనందమే ప్రధానం
ముంబయి: తన చిత్రం ఎన్ని వసూళ్లు రాబట్టిందనేది ముఖ్యం కాదని, ప్రేక్షకులను ఆ చిత్రం మెప్పించిందా లేదా? వారు ఆనందంగా రెండున్నర గంటలు గడిపారా లేదా అన్నదే ప్రధానమని తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రం విడుదలై బాలీవుడ్ లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన ఆయన 'నా చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అదే నేను కోరుకున్నాను. ఇప్పుడు ఈ చిత్ర బృందమంతా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. నాకు ఆనందమే బారో మీటర్. మా చిత్రం వందకోట్లు దాటింది. కాకపోతే అది ప్రధాన అంశం కాదు' అని ఆయన అన్నారు.