Hundred crore Club
-
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్‌కి సాయి ధరమ్ తేజ్
-
ఇది సిసలైన కేరళ స్టోరీ.. పది రోజుల్లో వందకోట్ల క్లబ్‌లోకి..!
భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాలీవుడ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్న కథలు.. విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి కలెక్షన్ల విషయంలో వరుసగా చిన్నాపెద్ద చిత్రాలు నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘2018’ పెనుసంచలనం సృష్టించింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘2018’.. మే 5వ తేదీన రిలీజ్ అయ్యింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదీ పాన్ ఇండియా సినిమాగా కాదు.. కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యి మరి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ఆడియొన్స్. జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన ‘2018’ చిత్రం.. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నా ఫుల్ రన్లో ఆ ఫీట్‌ను సాధించాయి. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. 2018.. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్. క్యాప్షన్‌కు తగ్గట్లే కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో అందరూ హీరోలే. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా చిత్ర కథ నడుస్తుంది. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలం అయిన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి?. వాటిలో అక్కడి ప్రజలు ఎలా భాగం అయ్యారు? చివరికి ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ. రెండున్నర గంటలపాటు సాగే కథలో.. ద్వితియార్థం సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ప్రేమ, ధైర్యం, సాహసం, త్యాగాలు.. రకరకాల భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించడంతో ఈ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ అనూప్ పాత్రలో అలరించాడు. బిజీ గవర్నమెంట్ ఉద్యోగి చివరికి వరదల్లో చిక్కుకున్న తన కుటుంబం కోసం తాపత్రయపడే షాజీ రోల్లో కున్చాకో బోబన్, ఎన్నారై రమేష్‌గా వినీత్ శ్రీనివాసన్, నిక్సన్ పాత్రలో అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి పేరున్న ఆర్టిస్టులు మాత్రమే కాదు, సినిమాలో చిన్నపాత్ర కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతుంది. -
ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వినాలి
‘‘ధమాకా’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమాని బాగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో రవితేజ అన్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజై, వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ధమాకా 101 కోట్ల మాసివ్ సెలబ్రేషన్’ని నిర్వహించింది. ఈ వేడుకలో మేకర్స్, మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు మొమెంటోలు అందించారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ– ‘‘విశ్వప్రసాద్‌గారు, వివేక్ కూచిభొట్లగారికి బిగ్ కంగ్రాట్స్. అలాగే త్రినాథరావు, రచయిత ప్రసన్న, శ్రీలీలకి అభినందనలు.. ఇలాంటి కంగ్రాట్స్ ఇంకా వింటూనే ఉండాలి. సంగీత దర్శకుడు భీమ్స్ ఇలాగే ఇరగదీసేయాలి’’ అన్నారు. ‘‘ధమాకా’ కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి, ఆయనకి సపోర్ట్‌గా నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకి థ్యాంక్స్. ఈ కథని తొలుత విని ఓకే చేసిన వివేక్‌గారికి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రవితేజ, శ్రీలీలకి «థ్యాంక్స్’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘ధమాకా’ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. ‘‘నా కెరీర్ బిగినింగ్‌లో రవితేజగారు నాకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు’’ అన్నారు శ్రీ లీల. -
వంద కోట్లకుపైగా వసూలు చేసిన 25 సినిమాలు
బాలీవుడ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తీగా మారిపోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు ఎన్ని రోజులు అడిందని చూడటంలేదు. వందరోజులు, సిల్వర్ జూబ్లీ, సూపర్ హిట్, బంపర్ హిట్లు ఇప్పుడు లెక్కలేదు. ఎన్ని కో్ట్ల రూపాయలు వసూలు చేసిందనేదే ముఖ్యం. తక్కువ రోజులు ఆడినా కలెక్షన్లు రాబడితేనే హిట్‌గా భావిస్తారు. వంద కోట్లు దాటితేనే బంపర్ హిట్ కింద లెక్క. వంద కోట్లు, అంతకు మించి వసూలు చేస్తే గొప్ప. ఇప్పటి వరకూ బాలీవుడ్, కోలీవుడ్ కలుపుకొని 25 చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాయి. సినిమా నిర్మాణం కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న లక్ష్యంతో జరుగుతోంది. పెద్ద హీరోల లక్ష్యం వంద కోట్లు. పైరసీల దెబ్బకు ఇంత కలెక్షన్లు సాధించడం కష్టమే. అయితే పెద్ద హీరోల చిత్రాలను కలెక్షన్ల కోసం నిర్మాతలు ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వాటిలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్మాతలకు కనకవర్గం కురుస్తోంది. ఒకటి, రెండు వారాల్లోనే కలెక్షన్లు దండుకోవడానికి నిర్మాతలు అలవాటుపడిపోయారు. పైరసీల తాకిడి తట్టుకోవడానికి వారికి మరో మార్గంలేదు. వంద కోట్ల రూపాయలు, అంతకు మించి వసూలు చేసిన సినిమాలు: సల్మాన్ ఖాన్ - దబాంగ్ - 150 కోట్లు సల్మాన్ ఖాన్ - రెడీ - 130 కోట్లు సల్మాన్ ఖాన్ - బాడీగార్డ్ -155 కోట్లు సల్మాన్ ఖాన్ - ఏక థా టైగర్ - 198 కోట్లు సల్మాన్ ఖాన్ - దబాంగ్ 2 - 178 కోట్లు షారూక్ ఖాన్ - రా-వన్ - 117 కోట్లు షారూక్ ఖాన్ - డాన్ 2 - 114 కోట్లు షారూక్ ఖాన్ - జబ్ తాక్ హైజాన్ - వంద కోట్లు షారూక్ ఖాన్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ - 214 కోట్టు అజయ్ దేవగన్ - గోల్మాల్ 3 - 108 కోట్లు అజయ్ దేవగన్ - సింగం - వంద కోట్లు అజయ్ దేవగన్ - బోల్‌బచ్చన్ - 104 కోట్లు అజయ్ దేవగన్ - సన్ ఆఫ్ సర్దార్ 106 కోట్లు అమీర్ ఖాన్ - గజనీ - 115 కోట్లు అమీర్ ఖాన్ - 3 ఇడియట్స్ - 202 కోట్లు అక్షయ్ కుమార్ - హౌస్‌ఫుల్ - 112 కోట్లు అక్షయ్ కుమార్ - రౌడీ రాథోర్ - 133 కోట్లు రణబీర్ కపూర్ - బర్ఫీ - 122 రణబీర్ కపూర్ - యే జవాని హై దివాని -189 కోట్లు హృతిక్ రోషన్ - అగ్నిపథ్ - 122 ఫర్హాన్ అక్తర్ - బాగ్ మిల్కా బాగ్ - 104 కోట్లు సైఫ్ ఆలీ ఖాన్ - రేస్ 2 - 115 కోట్లు దక్షిణాదిలో కూడా ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి. 'ఎంథిరన్' (తెలుగులో శివాజీ), దశావతారం, రోబో చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. ఇక దక్షిణాదిలో వంద కోట్ల క్లబ్లో చేరగల మార్కెట్ ఒక్క తెలుగుకు మాత్రమే ఉంది. అదీ కూడా భవిష్యత్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులకు ఆ ఆవకాశం ఉందని భావిస్తున్నారు.