హీరో– ప్రొడ్యూసర్ కాంబినేషన్ వరుసగా రిపీట్ కావాలంటే వరుస హిట్స్ అందించాలి. లేదంటే రెండు, మూడు సినిమాల డీల్ సైన్ చేయాలి. తమిళ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని బోనీ కన్‌ఫర్మ్ చేశారు. ‘‘బయట ప్రచారం అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అజిత్‌తో ‘నేర్‌కొండ పార్వై’ సినిమా నిర్మిస్తున్నాను. ఆ తర్వాత ఓ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నాం. అజిత్‌తో ఓ హిందీ సినిమా చేయించాలనే ఆలోచన నాకుంది. కానీ అజిత్ ఇంకా కన్‌ఫర్మేషన్ ఇవ్వలేదు’’ అన్నారు. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్‌గా రూపొందిన ‘నేర్‌కొండ పార్వై’ ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment