మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్ | Sridevi Shoots in Minus 7 Degree Temp | Sakshi
Sakshi News home page

మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్

Published Thu, Jun 16 2016 8:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్

మైనస్ ఏడు డిగ్రీల చలిలో షూటింగ్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది భామ శ్రీదేవి, రీ ఎంట్రీ లో కూడా అదే జోరు చూపిస్తోంది. హీరోయిన్ గా చేసిన సమయంలో ఏ స్థాయిలో కష్టపడిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కష్టపడుతోంది. పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అతిలోక సుందరి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయినా శ్రీదేవి రీ ఎంట్రీ పై ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.

ఆ తరువాత దక్షిణాదిలో చేసిన పులి డిజాస్టర్ కావటంతో ఆలొచనలో పడ్డ శ్రీదేవి, ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా మామ్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని జార్జీయాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేస్తోంది. అంత చలిలో ఒక్కోసారి షూటింగ్ ఆలస్యం అయి రాత్రి 8.30 అయినా ఎలాంటి విసుగు లేకుండా శ్రీదేవి షూటింగ్ కు సహకరించటం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.

శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి ఉద్యావర్ దర్శకుడు. ప్రముఖ పాకిస్థాని నటుడు అద్నాన్ సిద్దికీ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కన్నా, అభిమన్యూ సింగ్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement