
బోనీకపూర్ గారాలపట్టి జాన్వీ కపూర్, హీరో ఇషాన్ ఖట్టర్ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరు ‘ధడక్’ చిత్రంలో వెండితెరపై రొమాన్స్ చేయడంతో.. నిజ జీవితంలోనూ వీరి మధ్య బంధం ఏర్పడిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి బోనికపూర్ స్పందించి.. ‘జాన్వీ, ఇషాన్‌లపై వస్తున్నవార్తలు అవాస్తవం. వారు మంచి స్నేహితులు.. అదేవిధంగా నా కూతురు ఇషాన్‌తో చేసే స్నేహాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఇషాన్ తరుచు జాన్వీ ఇంటికి వెళ్లుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాగా ధడక్ మూవీ రిలీజ్ అయ్యాక ఇషాన్.. ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదు. దీంతోపాటు వారి ఇరువురి మధ్య స్నేహానికి మించి ఎలాంటి రిలేషన్ లేద’న్నారు.
తెలుగులో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ రీమేక్‌లో జాన్వీ , ఇషాన్ జంటగా నటిస్తారని బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత కరణ్ జోహార్ స్పందించాడు. ఇంకా నటీనటులు ఎవరనేది డిసైడ్ చేయాలేదని, డియర్ కామ్రేడ్ మూవీ పెద్ద విజయం సాధించాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.