అచ్చు శ్రీదేవి లాగే..ప్రియా రాజ్‌వంశ్‌! | Sridevi and Priya Rajvansh have uncanny resemblance | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 28 2018 4:14 PM | Last Updated on Wed, Feb 28 2018 4:25 PM

Sridevi and Priya Rajvansh have uncanny resemblance - Sakshi

ప్రియా రాజ్‌వంశ్‌, శ్రీదేవి

ప్యారలల్‌ లైఫ్‌... ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే రకమైన సంఘటనలు జరగటం. ఇది సినిమా కోసం అల్లిన కల్పనగా అనిపించినా.. కొన్ని సంఘటనలు ప్యారలల్‌ లైఫ్‌ నిజమేమో అన్న భావన కలిగిస్తాయి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న శ్రీదేవి మరణం విషయంలోనూ ఇలాంటి సంఘటనలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి జీవితానికి, మరో బాలీవుడ్‌ సీనియర్‌ నటి ప్రియా రాజ్‌వంశ్‌ జీవితానికి ఎన్నో సారూప్యతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు తారలు బాత్‌రూమ్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద‍్దరి మరణాలు ముందుగా కార్డియాక్‌ అరెస్ట్ కారణంగానే సంభవించినట్టుగా భావించారు. అయితే తరువాత ప్రియా మరణం.. హత్య అని తేలింది. శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు సంభవించినట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఈ ఇద్దరు చనిపోయిన సమయంలో మధ్యం సేవించి ఉన్నట్టుగా ప్రకటించారు.

వ్యక్తిగత జీవితంలోనూ శ్రీదేవి, ప్రియా రాజ్‌వంశ్‌ల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఈ ఇద్దరు తారలు బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ కుటుంబాల పెద్ద కుమారులను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్‌ ( అనిల్ కపూర్‌, సంజయ్‌ కపూర్‌ల అన్న)ను వివాహం చేసుకోగా.. ప్రియా, చేతన్‌ ఆనంద్ (దేవానంద్‌, విజయ్‌ ఆనంద్‌ల అన్న)ను వివాహం చేసుకున్నారు. అంతేకాదు శ్రీదేవి, బోని కపూర్‌ రెండో భార్య కాగా ప్రియా కూడా చేతన్‌ ఆనంద్‌కు రెండో భార్యే. ప్రస్తుతం ఈ ఇద్దరు తారల జీవితాలలోని పోలికలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement