
అజిత్
అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి లాయర్‌గా మారనున్నారు అజిత్. ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. బాలీవుడ్ హిట్ ‘పింక్’ చిత్రానికిది రీమేక్. ఇందులో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో నటించడానికి అజిత్ రెడీ అవుతున్నారు. అంటే.. లాయర్‌గా కోర్టులోకి దిగటానికి టైమ్ అయ్యిందన్నమాట.
బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అంతేకాదు అజిత్ నెక్ట్స్ చిత్రానికి కూడా బోనీ కపూర్‌నే నిర్మాత. ‘‘పింక్’ రీమేక్ కాకుండా అజిత్ నెక్ట్స్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలైలో ప్రారంభిస్తాం. ‘పింక్’ని వచ్చే ఏడాది మే 1న, అజిత్‌తో నిర్మించాలనుకుంటున్న మరో చిత్రాన్ని 2020 ఏప్రిల్ 10న రిలీజ్ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్. ఇక అజిత్ నటించిన తాజా చిత్రం ‘విశ్వాసం’ జనవరి 10న విడుదల కానుందని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment