సల్మాన్ ఖాన్
సినిమా రిలీజ్ అయితే చాలు... బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు, స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు టీఆర్‌పీలు రాకెట్లలా పైకి వెళ్తుంటాయి. ఇది బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ స్టామినా, స్టార్‌డమ్. కానీ ఇవేమీ తనకు పట్టవంటారు భాయ్. బాక్సాఫీస్ కోట్ల కన్నా, టీఆర్‌పీ అంకెల కన్నా ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఎక్కువ అంటున్నారు ఆయన. గురువారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ముంబైలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీ, ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారాయన. దానికంటే ముందు బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఎంతోమంది ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. స్టార్డ్‌డమ్ ముఖ్యమే, కానీ వాళ్ల ప్రేమకంటే పెద్దదిగా మాత్రం అనిపించదు. ప్రేక్షకులను అలరించడానికి ఇలానే కష్టపడుతుంటాను’’ అని పేర్కొన్నారు. ఇది సల్మాన్ 53వ పుట్టినరోజు. మరి.. భాయ్ బ్యాచిలర్‌హుడ్‌కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment