breaking news
Salman kha
-
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్‌తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్‌పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్‌కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
ప్రేమ ముఖ్యం
సినిమా రిలీజ్ అయితే చాలు... బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు, స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు టీఆర్పీలు రాకెట్లలా పైకి వెళ్తుంటాయి. ఇది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్టామినా, స్టార్డమ్. కానీ ఇవేమీ తనకు పట్టవంటారు భాయ్. బాక్సాఫీస్ కోట్ల కన్నా, టీఆర్పీ అంకెల కన్నా ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఎక్కువ అంటున్నారు ఆయన. గురువారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ముంబైలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీ, ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారాయన. దానికంటే ముందు బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఎంతోమంది ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. స్టార్డ్డమ్ ముఖ్యమే, కానీ వాళ్ల ప్రేమకంటే పెద్దదిగా మాత్రం అనిపించదు. ప్రేక్షకులను అలరించడానికి ఇలానే కష్టపడుతుంటాను’’ అని పేర్కొన్నారు. ఇది సల్మాన్ 53వ పుట్టినరోజు. మరి.. భాయ్ బ్యాచిలర్హుడ్కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. -
సల్మాన్‌కు పరామర్శల వెల్లువ
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గురువారం ఆయనను అనేక మంది బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కలసి పరామర్శించారు. బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ గురువారం మధ్యాహ్నం సల్మాన్ ఇంటికి వచ్చి ఆయనను కలసి మాట్లాడారు. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ సల్మాన్‌ను కలసి ఆయన ఇంట్లో గంటసేపు గడిపారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే కూడా బాంద్రాలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇంకా.. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, కరీనా కపూర్, క రిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, సంగీతా బిజిలానీ, సంజయ్ కపూర్, వహీదా రెహమాన్, గోవిందా, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ , తదితరులు కూడా సల్మాన్‌ను పరామర్శించారు. సోనాక్షీ సిన్హా, ప్రీతి జింతా, ప్రేమ్ చోప్రా, సునీల్ శెట్టి, తదితరులు బుధవారం సాయంత్రమే సల్మాన్ ఇంటికి వెళ్లారు. కాగా, హిట్ అండ్ రన్ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది. బుధవారం ఆయనకు శిక్ష పడిన వెంటనే రెండు రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన జస్టిస్ అభయ్ థిప్సే ముందుకే రెగ్యులర్ బెయిల్ విచారణ కూడా రానుంది.


