సల్మాన్‌కు పరామర్శల వెల్లువ
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గురువారం ఆయనను అనేక మంది బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కలసి పరామర్శించారు. బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ గురువారం మధ్యాహ్నం సల్మాన్ ఇంటికి వచ్చి ఆయనను కలసి మాట్లాడారు. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ సల్మాన్‌ను కలసి ఆయన ఇంట్లో గంటసేపు గడిపారు.
ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే కూడా బాంద్రాలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇంకా.. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, కరీనా కపూర్, క రిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, సంగీతా బిజిలానీ, సంజయ్ కపూర్, వహీదా రెహమాన్, గోవిందా, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ , తదితరులు కూడా సల్మాన్‌ను పరామర్శించారు.
సోనాక్షీ సిన్హా, ప్రీతి జింతా, ప్రేమ్ చోప్రా, సునీల్ శెట్టి, తదితరులు బుధవారం సాయంత్రమే సల్మాన్ ఇంటికి వెళ్లారు. కాగా, హిట్ అండ్ రన్ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది. బుధవారం ఆయనకు శిక్ష పడిన వెంటనే రెండు రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన జస్టిస్ అభయ్ థిప్సే ముందుకే రెగ్యులర్ బెయిల్ విచారణ కూడా రానుంది.