
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అభిమానులు కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి, తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు గోవిందరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శిరీష్, రామి రెడ్డి, తరుణ్, వెంకట్, రాకేష్, రమణ, రఘు, దామోదర్, శ్రీనివాస్, విష్ణు మహిళా సభ్యులు సుజాత, భారతి రెడ్డి, మను రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగ రెడ్డి మాట్లాడతూ, తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో రానున్న ఎన్నికల్లో పునావృతమవుతాయని, టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. తిమ్మారెడ్డి మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లుగా వైఎస్ జగన్ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గోవింద రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిపించుకోని రాష్ట్రంలో మరలా రాజన్న స్వర్ణయుగ పాలన సాధించుకుందామన్నారు. ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గల్లో పార్టీ కార్యక్రమాల్లో సహయ, సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్‌కే సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు.