
బ్రిస్బేన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకుని.. తద్వారా జరగబోయే రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఎన్నారైలకు పిలుపు ఇచ్చారు నటుడు, వైఎస్సార్‌సీపీ నేత.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అలీ.
సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిదని.. మరోసారి ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగం కావాలని అలీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి తోపాటు ఇరువూరి బ్రహ్మ రెడ్డి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్ రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment