ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సింగపూర్ లోని ఎన్.ఆర్.ఐ లు మరియు వైస్సార్సీపీ సింగపూర్ టీం, సింగపూర్ వైస్సార్సీపీ అడ్వైసర్ కోటి రెడ్డి మరియు సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటిరెడ్డి మరియు మురళి కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సమంగా పరుగులు తీయిస్తున్నారు.
అలానే 99 శాతం హామీలు నెరవేర్చి సుపరిపాలన చేస్తున్నారు అని చెప్పినారు. విద్య, వైద్య రంగాలలో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. 38000 స్కూల్స్ అధునాతనంగా తీర్చిదిద్దారు. 15000 గ్రామసచివాలయాలు, 10000 రైతు భరోసా కేంద్రాలు, 10000 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 10 ఫిషింగ్ హర్బోర్స్ , 4 పోర్ట్స్, 9000 కోట్లతో రోడ్ల అభివృద్ధి, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది కేవలం ఈ నాలుగు సంవత్సరాలలో.
ఆరోగ్యశ్రీ ని 25 లక్షల వరకు పెంచటం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి అన్ని 9 రకాల పరీక్షలు నిర్వహించటం అనేవి విదేశాలలో కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు అని గుర్తుచేశారు.ఇవన్నీ ఇలా కొనసాగాలి అంటే మరల జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవటం మన అందరి అవసరం మరియు బాధ్యత.
కావున మన అందరం వచ్చే మూడు నెలలు ఒక సైనికుడిలా పని చెయ్యాలి అని చెప్పినారు. ఈ జన్మదిన వేడుకలలో భాస్కర్, శ్రీనివాసులు, గుండు కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్ర, అఖి రెడ్డి, సుధీర్, ప్రసాద్, మధు, రాంమోహన్, రంగా రెడ్డి, విష్ణు, దొర బాబు, లీల, చిట్టి బాబు, శ్రీనాధ్, సుహాస్, నాగ సత్యనారాయన రెడ్డి, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment