
రామ్‌చరణ్, ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మళ్లీ కలిశారు. రీసెంట్‌గా మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ‘భరత్ బహిరంగ సభ’ సందర్భంగా ఈ ముగ్గురు స్టార్లు కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఇలా టాప్ హీరోలందరూ విభిన్న సందర్భాలలో ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఇండస్ట్రీలోని మంచి వాతావరణానికి సంకేతమని ఇండస్ట్రీ వాసులు అనుకుంటున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో ఎన్టీఆర్, ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్ ఇప్పుడు తాజా సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి విజయాలతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డేలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment