బర్త్‌డే పార్టీలో విషాదం.. నలుగురి మృతి | 4 dead in electric shock during birthday celebration | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 11:42 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

4 dead in electric shock during birthday celebration - Sakshi

బర్త్‌డే వేడుకలు

లుధియాన : బర్త్‌డే పార్టీ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి తాగిన మత్తులో హైటెన్షన్‌ వైర్‌ పట్టుకోవడంతో అతన్ని కాపాడేందుకు యత్నించిన మరో ముగ్గురు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ హృదయ విచారక ఘటన పంజాబ్‌లోని లుధియానలో చోటుచేసుకుంది. మృతుల్లోని ఒకరి కూతురు బర్త్‌డే పార్టీలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. ఒకరు తాగిన మైకంలో హైటెన్షన్‌ వైర్‌ పట్టుకోవడంతో మరో ముగ్గురు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ప్రమావదశాత్తు నలుగురికి విద్యుత్‌ షాక్‌ తగలడంతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement