
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన (ఫిబ్రవరి 17) వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆయన కుటుంబ సభ్యులు మొక్కలు నాటి కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరు ఒక్కో మొక్క నాటాము. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని కోరుకుంటున్నాము. అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆయన మా తండ్రి అయినందుకు ఎంతో గర్విస్తున్నా’ను అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment