
జెడ్దా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా జరిపారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రచార కన్వీనర్ షేక్ సలీమ్ తాను ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ కంపేనీలో సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని సలీమ్ పేర్కొన్నారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా జననేతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గల్లో పార్టీ కార్యక్రమాల్లో సహయ, సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్ కే సాధ్యమన్నారు. తప్పకుండా మనమందరం కలిసి రాష్ట్రంలో మైనార్టీలకు మేలుచేసిన నాయకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ గెలుపు కొసం అల్ల్హాని దువా చేస్తూ, అలానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను విసృతంగా జరపాలని కొరారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వైఎస్సార్‌సీపీ తరఫున గెలిపించుకోని రాష్ట్రంలో మరలా రాజన్న స్వర్ణయుగ పాలన సాధించుకుందామన్నారు. ముఖ్యంగా మైనార్టీలను నాలుగున్నరేళ్ళుగా మోసం చేసిన చంద్రబాబును మైనార్టీలోకం క్షమించదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంజీవనైనా ప్రత్యేకహోదా జగన్ ద్వారానే సాధ్యమని, కాబట్టి రాష్ట్ర ప్రజానికం ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని సూచించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా నక్కజిత్తుల రాజకీయాలను గ్రహించాలన్నారు. కార్యక్రమంలో షేక్ సలీంతో పాటు, అబ్దుల్ హమీద్, ఆమీర్, మహ్మద్ సిరాజ్, షేక్ ఫరీద్, సిరాజుద్దీన్, బిన్ సాద్, మథిన్, అక్రమ్, ఇమ్రాన్ తదితరులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment