ప్రధాని మోదీ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ | BJP leaders extend birthday wishes PM turns 74 | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ

Published Tue, Sep 17 2024 8:17 AM | Last Updated on Tue, Sep 17 2024 9:31 AM

BJP leaders extend birthday wishes PM turns 74

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌మీడియాలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మోదీకి త్రిపుర సీఎం మాణిక్‌ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పీఎం ఆవాస్‌ ఇళ్లను ప్రారంభించన్నారు.

 

 

మోదీకి ఉత్తరాఖండ్ సీఎం జన్మదిన శుభాకాంక్షలు
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.‘ రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది నివాసితుల తరపున, మీ ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, విజయవంతమైన జీవితం కోసం నేను మహాదేవ్‌ను ప్రార్థిస్తున్నాను. మీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కొనసాగించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

మోదీకి ఒడిశా సీఎం జన్మదిన శుభాకాంక్షలు
మోదీకి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అసమానమైన నాయకత్వంలో, దేశం విక్షిత్ భారత్ వైపు అధిక వృద్ధి పథంలో పయనిస్తోంది. మీరు దేశ సేవలో దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

చదవండి: ఏడుపదుల వయసులోనూ కుర్రాడిలా ప్రధాని మోదీ.. ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement