
టబు
‘‘చిన్న చూపుతో మన హార్ట్ బీట్‌ని ఒక్క క్షణం ఆపేయగలరు. టాలెంట్‌తో ఎవ్వరినైనా ముగ్ధుల్ని చేయగలరు టబు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు కలసి పని చేయాలనుకుంటున్నాం’’ అని టబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ‘అల వైకుంఠపురములో..’ టీమ్. అంతేకాదు.. ఈ సినిమాలో టబు లుక్‌ను విడుదల చేశారు.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగు తెరపై కనిపించబోతున్నారు టబు. 2008లో వచ్చిన ‘పాండురంగడు’ టబు నటించిన చివరి తెలుగు చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment