
‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ స్క్రీన్‌పై కనిపించకుండా చిన్న గ్యాప్ ఇచ్చారు. అది కావాలని ఇవ్వకపోయినా ఆ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చిన ఆయన థియేటర్‌లో కనిపించే తేదీని ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment