రైల్వేకోడూరు అర్బన్: అల్లూరికి నివాళి అర్పిస్తున్న అల్లూరి యువజన సేవా సంఘం
రైల్వేకోడూరు : అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి , జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పార్టీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. సమాజం, రాష్ట్రం కోసం పోరాడాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, ఇనమాల మహేష్, సుబ్బరామరాజు, ఎంపీటీసీలు మందల శివయ్య, ఆవుల రవిశంకర్, రత్తయ్య, గంగయ్య, రాజా పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి
రైల్వేకోడూరు అర్బన్ : స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని అల్లూరి యువజన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం సంఘం నాయకులు స్థానిక టోల్‌గేట్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నాటి పోరా టాలే.. నేడు మనందరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ ఇన్‌చార్జి గల్లా శ్రీనివాసులు, అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం చంగల్ రాజు, ఓబులవారిపల్లె ఎంపీపీ వెంకటేశ్వర రాజు, క్షత్రియ సంఘం నాయకులు బలరామరాజు, తోట శ్రీనివాసులు, జయప్రకాశ్ నారాయణ వర్మ, సుబ్బరామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రాజు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలి
బొమ్మవరం(ఓబులవారిపల్లె): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బుధవారం బొమ్మవరం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా బొమ్మవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్యాడ్స్ తదితర విద్యాసామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్య్రం సాధించడంలో బ్రిటీష్ దొరలను దేశం నుంచి తరిమికొట్టేందుకు చేసిన పోరాటాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు గడ్డం చెంగల్‌రాజు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు
పీవీజీపల్లె(పుల్లంపేట): మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని వక్తలు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం పీవీజీ పల్లె ఉన్నత పాఠశాలలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి మాట్లాడుతూ తెల్లదొరలను ఎదిరించి గిరిజనులకు అండగా నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఉపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. భారతి మాట్లాడుతూ మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి బ్రిటీష్ వారిని ఎదిరించిన ధీరుడు అల్లూరి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రెడ్డి ప్రసాద్, తెలుగు పండితులు గంగనపల్లె వెంకటరమణ, పీఈటీ చంద్రకుమార్, సుబ్బరామిరెడ్డి, శివశంకర్‌రాజు, సుజిత, నవీన్‌కుమార్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment