ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే | People Celebrating Every Small Movement in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

Published Mon, Jul 15 2019 11:10 AM | Last Updated on Thu, Jul 18 2019 12:58 PM

People Celebrating Every Small Movement in Hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో: ఎవరైనా విందు చేసుకుంటున్నారంటే అది వారికి ప్రత్యేకమైన రోజై ఉంటుంది.. పుట్టినరోజో..పెళ్లిరోజో.. అయి ఉండవచ్చు. అందుకే ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడానికి పార్టీ చేసుకోవడం సరదా. అయితే ఇపుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి సంతోషా న్ని విందు రూపంలో నలుగురితో పంచుకోవడం అలవాటుగా మారిపోయింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైనా, వీసా వచ్చినా, విదేశీ ప్రయాణం అయినా ఏదైనా పార్టీ చేయాల్సిందే. అది కూడా మాములుగా కాదు..హంగామా ఉండాల్సిందే. ఇదీ ఇప్పటి కల్చర్‌.  గతంలో కూడా పార్టీలు జరిగేవి కానీ ఈ స్థాయిలో కాదు. నేడు ప్రతి చిన్నా జ్ఞాపకాన్ని నగర ప్రజల డిఫరెంట్‌గా  పార్టీ చేసుకుంటు న్నారు. ఇటీవల నగరంలో పార్టీ కల్చర్‌ విపరీతం గా పెరిగింది. పాతబస్తీలోని డబీర్‌పూర్‌లో నివా సం ఉండే ఓ కుటుంబ సభ్యులకు తమ అమ్మా నాన్నల పెళ్లిరోజు... పాతికేళ్ల వివాహ ఉత్సవాన్ని ఘనంగా చేయాలనే ఆలోచన వచ్చింది. తాము ఎక్కడో దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్న అను భూతి కలగాలనేది .. ఆ అన్నాచెల్లెళ్ల అంతరంగం. వారం ముందుగానే  బంధువులు.. స్నేహితులకు సమాచారం చేరవేశారు. ఆ రోజు.. ఎవరెవరు ఏమి చేయాలో నిర్ణయించుకున్నారు.  ఉదయాన్నే.. గులాబీపూలతో తల్లిదండ్రులకు అభినందనలు పంపారు. మరో గంటలో కొత్త వస్త్రాలు వచ్చాయి.  రాత్రి 10 గంటలకు.. ఇంటి వాతావర ణం పూర్తిగా మారిపోయింది. రుచికరమైన వంటకాలు.. ఆప్యాయతను పంచే ఆత్మీయుల మధ్య.. కేక్‌ కోసి... మరచిపోలేని జ్ఞాపకంగా ఉత్సవాన్ని ఆస్వాదించారు. ఇదంతా.. తమ పిల్లలు ఏర్పాటని తెలుసుకుని సంతోషించారా పెద్దలు.

జీవిత బాగస్వామి కోసం  
పెళ్లయిన నాటి నుంచి తన మ్యారేజ్‌ డేను ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు చిక్కడ్‌పల్లి నివాసి.  తన జీవిత భాగస్వామితో మ్యారేజ్‌ డే వినూత్నంగా చేయాలనుకున్నాడు. అ రోజు రాగానే లవ్‌సింబల్‌ బెలూన్లూ... వీనులవిందైన సంగీతం.. ఇలా.. ఆమెకు.. తొలి బహుమతిని ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో విహరిస్తూ.. నగరాన్ని చుట్టొచ్చారు.. ‘ఇది.. అతిగా అనిపించినా.. మా మధ్యన మరిం త స్నేహాన్ని.. ప్రేమను పెంచేందుకు ఉపయోగపడుతుంది’ అంటూ ఆనందంగా తన అనుభవాన్ని పంచుకున్నాడు... . తన భార్య  కళ్లలో ఆ క్షణం కనిపించిన మెరుపు తనకు గొప్ప బహు మతి అంటూ తన అనుభూతిని వివరించాడు.

జ్ఞాపకం ఎదైనా
మారుతున్న కార్పొరేట్‌ సంస్కృ తికి తగినట్లుగా.. వేడుకలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అందించే కానుకలూ సరికొత్తగా కనిపిస్తున్నాయి. కొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించే నగరవాసులు.. ఇప్పుడు పార్టీలు.. వేడుకల్లోనూ అదే ధోరణిని అనుసరిస్తున్నారు. మారిన అభిరుచికి తగినట్లు ఉత్సవాలను కోరినట్టుగా చేసేందుకు పలు ఈవెంట్‌ సంస్థలు ముందుకువచ్చాయి. 

భావోద్వేగ బహుమతులు
భార్యాభర్తలు.. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు.. స్నేహితులు.. సహోద్యోగులు.. ఇలా ప్రతిచోటా ఒకర్నొకరు ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ ముందుకు వెళుతుంటారు. సరదాలు.. సంబరాలు.. ఉత్సవాలు.. వంటి సమయాలో తమ అభిమానం వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ‘పెద్దల సమ్మతితో కుదిరిన పెళ్లి.. ఎంగేజ్‌మెంట్‌ వేళ కాబోయే భార్యకు బహుమతి ఇవ్వాలనుకున్నా.. అది  ఆమె పనిచేసే ఆఫీసులో ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకున్నా. పెళ్లికి ముందుగానే నా ప్రేమను చెప్పేందుకు తనకు ఇష్టమైన బహుమతిని ఇచ్చి మా ఇద్దరి ఆలోచన ఒక్కటే అనే విషయాన్ని తనతో  పంచుకున్నా’నంటూ వివరించాడు కార్పొరేట్‌ ఉద్యోగి.

గతంలో పోలిస్తే  
గతంతో పోలిస్తే చాలా మార్పు కనిపిస్తుంది. అవతలి వారి మెప్పుపొందాలనే ఉద్దేశంతో కాకుండా తమ ప్రేమను వ్యక్తీకరించాలనే ఆలోచన పెరుగుతుందంటున్నారు ఈవెంట్‌ నిర్వాహకులు.  ఉద్యోగ, వ్యాపార నిర్వహణలో తలమునకలవుతున్న వారంతా ఏడాదికోసారి వచ్చే వేడుకలను గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తున్నారు. సామాజిక హోదాను ప్రతిబింబించేలా కాకుండా.. తన వారితో ఆప్యాయతను పంచుకునేలా మలచుకుంటున్నారు. ఇప్పటి యువతీ, యువకులు తాము జీవితంలో స్థిరపడ్డాక.. అమ్మానాన్నలకు తాము గొప్ప బహుమతులు ఇవ్వాలని ఉత్సాహం చూపటం.. తమకూ ఆనందంగా అనిపిస్తుందని తెలిపారు.

బహుమతి ఇవ్వాల్సిందే  
భార్యాభర్తల మధ్య చిలిపి తగాదా.. మాటలు దూరం చేసిన వైరాన్ని ‘సారీ’తో భర్తీ చేయాలి. తనకు ఇష్టమైన కెరీర్‌లో ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న భర్తకు ‘థ్యాంక్స్‌’ చెప్పాలి. కొత్త కంపెనీలో రేయింబవళ్లు పని చేసిన ఉద్యోగులకు అభినందలు పంచాలి. ఇలా.. ఆలుమగల నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకూ...‘బహుమతి’ ఇవ్వటం ద్వారా తమ ప్రేమ, కృతజ్ఞతలను తెలుపుతున్నారు. బెలూన్లు, గులాబీపువ్వులు, గాల్లో చక్కర్లు, సంగీతకచేరి,  ఖరీదైన కార్లు, బైక్‌లపై షికార్లు, ఎదుటివారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా... ఎన్నో అంశాలతో సృజనాత్మకతగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. పండుగలు.. వేడుకలు.. వాలెంటైన్స్‌ డే.. ఫ్రెండ్‌షిప్‌డే.. మదర్స్‌డే.. ఫాదర్స్‌డే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన థీమ్స్‌తో అవతలి వారికి ప్రేమతో షాక్‌లిస్తూ సంతోషాన్ని పంచటం కొత్త అనుభూతిని మిగుల్చుతుందంటున్నారు నిర్వాహకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement