బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురువారం 53వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు చేసుకునే వారికి అందరు కానుకలు ఇవ్వడం సహజం. కానీ అందుకు భిన్నంగా సల్మానే తన తల్లికి గిఫ్ట్ ఇవ్వనున్నారంట. న్యూ ఇయర్‌కి గాను తన తల్లి సుశీలా చరక్‌కు ఓ స్పేషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అన్నారు సల్మాన్. ఈ విషయం గురించి సల్మాన్ మాట్లాడుతూ.. ‘నాలుగు రోజుల క్రితం మా అమ్మ న్యూ ఇయర్‌కు ఏం తీర్మానం చేసుకుంటున్నావని అడిగింది. అందుకు నేను ఏం లేదని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఇప్పుడు నీకు ఫోర్ ప్యాక్ బాడీ ఉంది. కానీ వచ్చే ఏడాదికి గాను సిక్స్ ప్యాక్ బాడీ చూడాలనుకుంటున్నాను అని చెప్పింద’న్నారు.
అందుకే నేను మరింత క్రమశిక్షణగా ఉంటూ.. మా అమ్మ కోరిక నేరవేర్చాలనుకుంటున్నానని చెప్పారు. అంతేకాక ‘సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జిమ్‌కు వెళ్తున్నాను. గంటసేపు రన్నింగ్ చేస్తున్నాను. నా ఆహారపు అలవాట్లను కూడా కంట్రోల్ చేసుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు. కాగా బుధవారం రాత్రి నుంచి సల్మాన్ ఫాం హౌస్ పాన్వెల్‌లో బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సల్మాన్ కుటుంబంతో పాటు సుస్మితా సేన్, కృతి సనన్, కత్రినా కైఫ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. పార్టీలో సుస్మిత, సల్మాన్ కలిసి డ్యాన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment