భార్గవ రామ్‌ @ 1 | JR NTR Celebrates His Son Bhargav Ram's First Birthday | Sakshi
Sakshi News home page

భార్గవ రామ్‌ @ 1

Published Sat, Jun 15 2019 12:17 AM | Last Updated on Sat, Jun 15 2019 12:17 AM

JR NTR Celebrates His Son Bhargav Ram's First Birthday - Sakshi

∙భార్గవ రామ్‌తో ఎన్టీఆర్‌, అభయ్‌ రామ్, భార్గవ రామ్‌

చిన్న తనయుడు భార్గవ రామ్‌ పుట్టినరోజున (శుక్రవారం) హీరో ఎన్టీఆర్‌ రెట్టింపు ఆనందంతో సమయాన్ని గడిపారు. ఆ మధుర జ్ఞాపకాలను ఫొటోలుగా మలిచి అభిమానులతో షేర్‌ చేసుకున్నారు ఎన్టీఆర్‌. ‘‘భార్గవ రామ్‌ ఏడాది పూర్తి చేసుకున్నాడు’’ అన్నారు ఎన్టీఆర్‌. 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో ఈ దంపతులకు అభయ్‌ రామ్‌ జన్మించాడు.

రెండో కొడుకు భార్గవ రామ్‌కు ఈ శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దర్నీ ఫొటో తీసి, దాన్ని కూడా షేర్‌ చేశారు ఎన్టీఆర్‌. ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌ మరో హీరో. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించే పేర్లలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్, తమిళ దర్శకుడు అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement