సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జన్మది నాన్ని పురస్కరించుకుని ’సేవా పఖ్వారా’ పేరుతో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా ప్రజాసేవా కార్యాక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల పారీ్టల శాఖలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
సేవా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్‌లు నిర్వహించాలని జేపీ నడ్డా బీజేపీ శ్రేణులను ఆదేశించారు. ఆయుష్మాన్ కార్డులు లేని వారికి వాటిని అందించడంలో సహకరించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరుగున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలకు నిర్వహించాలని చెప్పారు. ప్రధానిగా తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన విజయాలు, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని çకోరారు
Comments
Please login to add a commentAdd a comment