Public service activities
-
Seva Pakhwara: ప్రజాసేవలో నిమగ్నమవుదాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జన్మది నాన్ని పురస్కరించుకుని ’సేవా పఖ్వారా’ పేరుతో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా ప్రజాసేవా కార్యాక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల పారీ్టల శాఖలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్‌లు నిర్వహించాలని జేపీ నడ్డా బీజేపీ శ్రేణులను ఆదేశించారు. ఆయుష్మాన్ కార్డులు లేని వారికి వాటిని అందించడంలో సహకరించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరుగున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలకు నిర్వహించాలని చెప్పారు. ప్రధానిగా తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన విజయాలు, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని çకోరారు -
కన్నకొడుకులే కాదుపొమ్మన్రు..
మంచిర్యాలఅగ్రికల్చర్ : కని పెంచిన తల్లిదండ్రులను జీవిత మలిసంధ్యలో ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన కొడుకులు వారిని భారంగా భావించి వదిలించుకున్నారు. బుక్కెడు బువ్వకు ఆశపడ్డ వృద్ధులను నిర్ధాక్షిణ్యంగా ఇంటినుంచి బయటకు పంపించారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇద్దరు వృద్ధులు కలెక్టర్ కర్ణన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన వడ్డెపెల్లి చంద్రయ్య ఇల్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. పరిహారం కింద పైసా కూడా రాలేదు. ఉండటానికి ఇల్లు లేదు. ఒక్కగానొక్క కొడుకు దగ్గర బతుకుదామని వెళ్తే కాదు పొమ్మని వెళ్లగొడుతున్నాడు. తనకు బతికే దారిచూపాలని కోరుతూ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి చంద్రయ్యకు కొడుకు నుంచి జీవనభృతి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటి పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, వెంటనే పరిహారం అందేలా చూడాలని ఆర్డీవోకు సూచించారు. నర్సమ్మది మరో ఆవేదన బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆగునూరి నర్సమ్మ భర్త సింగరేణి కంపెనీలో ఉద్యోగం చేసి మరణించాడు. భర్త ఉద్యోగం కొడుకు ధర్మరాజ్‌కు పెట్టించింది. కుమారునికి, కూతురికి వివాహం జరిపించింది. గతంలో బాగానే చూసిన కొడుకు కొంతకాలం క్రితం తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దిక్కులేని ఆమె శ్రీసాయి అనాథ శరణాలయంలో చేరింది. కొన్ని రోజుల కిందట ధర్మరాజ్ శరణాలయానికి వచ్చి మా ఆమ్మను బాగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత మరల తిట్టుకుంటూ ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో నర్సమ్మ ఎవ్వరి ఇళ్లకు వెళ్లలేక, తిరిగి అనాథ శరణాలయం వెళ్లాలంటే మనసొప్పక ఒంటరిగా కాలం వెళ్లదీస్తోఓంది. కుమారుడు తన పోషణ బాధ్యత చేపట్టేలా చూడాలని, లేకుంటే నెలకు రూ.5వేల జీవనభృతి ఇప్పించాలని వేడుకుంది. అలాగే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తే తనకు ఆసరాగా ఉంటుందని కలెక్టర్‌కు విన్నవించుకుంది. -
షర్మిల పాదయాత్ర మహోజ్వల ఘట్టం..
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో రెండు పర్యాయాలు నిర్వహించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లా చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. ‘నేను మీ రాజన్న కూతుర్ని.. మీ జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఆమె ప్రజలను ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన ఆమె ఖమ్మం జిల్లా వైపు అడుగులు వేశారు. జిల్లాలో 27రోజులపాటు పాదయాత్రను కొనసాగించారు. 14 నియోజకవర్గాల్లో 340.8కిలోమీటర్లు నడిచిన షర్మిల 11రచ్చబండ సభలు నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా గురుతర బాధ్యతలను నిర్వర్తించారు. 14చోట్ల షర్మిల నిర్వహించిన బహిరంగ సభలు జనసముద్రాన్ని తలపించాయి. మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మైలవరంలో 120రోజులు పూర్తి చేసుకోగా, పెడన నియోజకవర్గంలో 1500కిలోమీటర్లు పూర్తిచేసుకుని యాత్రలో 50వ అసెంబ్లీ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అందుకు గుర్తుగా పెడన బైపాస్ రోడ్డు సమీపంలో 18అడుగుల వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతేడాది సెప్టెంబర్ 11, 12 తేదీల్లో సమైక్య శంఖారావం పేరుతో షర్మిల మరోమారు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు బహిరంగసభల్లో మాట్లాడిన షర్మిల రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్సీపీ చేసిన ఉద్యమానికి ఊతమిచ్చారు.