
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో రెండ్రోజుల ముందే ఆయన జన్మదిన వేడుకల సందడి నెలకొంది. ఈనెల 17న కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు తమ అభిమాన నేతకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. శనివారం పట్టణంలోని మైదానంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.600 మంది తమ అభిమాన నేత కేసీఆర్ ఆకారంలో నిలబడ్డారు. ఈ దృశ్యాన్ని 120 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ కెమెరాలో బంధించారు. అనంతరం మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment