ఘనంగా వైఎస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు | YS Vijayamma Birthday Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు

Published Fri, Apr 19 2019 12:33 PM | Last Updated on Fri, Apr 19 2019 3:51 PM

YS Vijayamma Birthday Celebrations - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. విశాఖ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కొయ్యా ప్రసాద్‌ రెడ్డి, రొంగలి జగన్నాథం, పీలా ఉమారాణి, గరికిన గౌరీ, పీలా వెంకటలక్ష్మీ, మాజీ కార్పొరేటర్లు రమణి, మొల్లి అప్పారావు, హేమలతతో పాటు పెద్దు ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ రెడ్డి తన నివాసంలో విజయమ్మ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరిపారు. కేకు కట్‌ చేసిన అనంతరం 500 మందికి చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే కేక్‌ను కట్‌ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డాక్టర్‌ వైఎస్‌ విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్‌ కుమార్‌ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేతలు రమేష్‌ రెడ్డి, పైలా నరహింహయ్యలు హాజరయ్యారు.

ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగడ సుజాత ఆధ్వర్యంలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు కేక్‌ కోసి విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement