
భూమన కరుణాకరరెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి 60వ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తిరుపతి లోని పద్మావతీపురం ప్రధాన రోడ్డు మొత్తం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, మామిడి తోరణాలు, ఆహ్వాన ద్వారాలతో శోభాయమానంగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో సంబరాల ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి. సుమారు ఐదువేల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు విందు ఆరగిం చేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమన ఇంటిని ధగధగలాడే విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కొబ్బరిబోండాంలు, అరటి పిలకలతో కూడిన స్వాగత తోరణాలు అడుగడుగునా ఏర్పాటు చేశా రు. బెంగళూరు, చెన్నై నుంచి రప్పిం చిన ఆర్కిటెక్టులు, డిజైనర్లతో రోడ్డంతా పందిళ్లు వేయించారు. భూమన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భారీ వేదిక నిర్మించారు. దీని మీదనే భూమన దంపతులకు షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించనున్నారు.
ఉదయం 7 నుంచే కార్యక్రమాలు
గురువారం ఉదయం 7 గంటల నుంచే పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం అభిమానుల మధ్య కేక్ కటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి భూమన మాట్లాడతారు. ఇది ముగిశాక పక్కనే ఉన్న వేదికపై షష్టిపూర్తి కార్యక్రమం మొదలవుతుంది. వేదపండితుల ఆశీర్వచనం, వేదమంత్రాల పఠనం, పెద్దల ఆశీస్సులు పూర్తయ్యాక విచ్చేసిన అభిమానులకు విందు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాలన్నింటినీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రముఖులతో పాటు భూమన శ్రేయోభిలాషులు, మిత్రులు, సాహిత్యాభిలాషులు హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment