
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ అవినాష్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. జననేత వైఎస్ జగన్ పేరుతో ప్రత్యేకంగా కేక్‌ను తయారు చేయించారు. ఏపీలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.