కువైట్ : వైఎస్సార్‌సీపీ కువైట్ మైనారిటీ విభాగం ఇంచార్జ్ షేక్ గఫార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 'హర్ దిల్ మే వైఎస్సార్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప శాసన సభ్యులు అంజాద్ బాషా, జాతీయ ప్రధాన కోశాధికారి రెహామన్, విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, నూర్ బాబా పాల్గొన్నారని ఒక ప్రకటనలో గల్ఫ్ కువైట్ కన్వీనర్లు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి ముస్లిం గుండెల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారనేది ఎంత నిజమో ముస్లిం సోదరులు అంటే జగన్‌కి ఎంతో అభిమనం ఉన్నదనేది కూడా అంతే నిజమని తెలిపారు.
వైఎస్సార్ ఆశయ సాధన కొరకు పనిచేస్తున్న వైఎస్ జగన్ తన తండ్రి మైనారిటీ ముస్లిం సోదరులకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనేకాకుండా, ఇంకా ఎన్నో సంక్షేమ పధకాలు ముస్లిం సోదరుల కొరకు ప్రవేశ పెడతారన్నారు. గల్ఫ్ లో సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో గల్ఫ్, కువైట్‌లో ఉన్న ముస్లిం సోదరులు ఓట్ల ద్వారా తమ ఆశీర్వాదాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్ మాట్లాడుతూ 2019 లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యవర్గ సభ్యులు, మైనారిటీ సోదరులు వైఎస్సార్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గొన్నారు.
కువైట్‌లో ఘనంగా 'హర్ దిల్ మే వైఎస్సార్'
Published Sat, Dec 29 2018 9:09 PM | Last Updated on Sat, Dec 29 2018 9:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment